సెకండ్ వేవ్ తో కోలుకోలేని దెబ్బ- మజుందార్ షా

భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ సునామిలా దెబ్బతీస్తోందని బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా అన్నారు. దేశంలో ఇటీవల రాష్ట్రాల ఎన్నికలు, ఉత్సవాలు, వేడుకలతో కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరిగాయని అన్నారు. గత రోజులతో పోలిస్తే ఇప్పుడు రోజుకు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్‍ల కొరత పెరిగింది. ఈసారి సెకండ్ వేవ్ సునామిలా భారత్ దెబ్బతీస్తోందని, దేశంలో ఎక్కడా ఎవ్వరిని వదలని పరిస్థితి నెలకొందని ఆమె అన్నారు. ఇప్పుడు దేశాన్ని ఈ సంక్షోభం నుంచి కాపాడేందుకు అందరూ కృషి చేయాలని ఆమె కోరారు.