లండన్ లో బతుకమ్మ వేడుకలు
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చే నెల 10న లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. జాగృతి ప్రవాస విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకల్లో బ్రిటన్‌లో ఉన్న తెలంగాణ కుటుంబాలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను హైదరాబాద్‌లో కవిత ఆవిష్కరించారు. వేడుకల్లో పాల్గొనే మహిళలకు చేనేత చీరలను అందించనున్నామని జాగృతి యూకే విభాగం అధ్యక్షులు సుమన్ బల్మూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్‌సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, కార్యదర్శి రోహిత్‌రావు తదితరులు పాల్గొన్నారు.













