టాక్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
యునైటెడ్ కింగ్డం తెలంగాణ సంఘం (టాక్) ఆధ్వర్యంలో బ్రిటన్ రాజధాని లండన్లోని ప్రసిద్ధ టవర్ వంతెన వద్ద బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రిటన్లో ఉన్న తెలంగాణ వారితో పాటు భారతీయ కుటుంబాల వారు ఇందులో పాల్గొన్నారు. లండన్లో అందుబాటులో ఉన్న పూలతో బతుకమ్మలను పేర్చి, వంతెన వద్దకు ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. వేదిక వద్ద వాటిని చేర్చి ఆటపాటలతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలు జరిపామని టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, కంది పవిత్రా రెడ్డిలు తెలిపారు. కరోనా సమయంలోనూ మహిళలు ఉత్సాహంగా ముందుకొచ్చి తెలంగాణ సంస్కతిని చాటడం గర్వంగా ఉందని అన్నారు.













