అభివృద్ధి పథంలో తెలుగు రాష్ట్రాలు : బాలకృష్ణ
స్నేహపూర్వక వాతావరణంలో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్మే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఆస్పత్రి 17వ వార్షికోత్సవానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్వవస్థాపకుడు ఎన్టీఆర్తో సంబంధాలు కల్గిన ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ అభివృద్ధి పథంలో తెలుగు ప్రజలను ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చి ఇన్స్టిట్యూట్ అభివృద్ధి కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చక్కటి ప్రోత్సాహం, చేయూత ఇస్తుండటం ఆ సంస్థ చైర్మన్గా తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రులు కామినేని శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, సహా ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల, సినీనటి గౌతమి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెంల గోపీచంద్, పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు.













