మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవ ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ ఈవో విజయరామారావు, ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి అందజేశారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి కొండా సురేఖను ఆలయ ఈఓ విజయరామారావు, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, అర్చకులు నవీన్ శర్మ పట్టు శాలువాతో సత్కరించి, ఆశీర్వచనలు అందించారు. 3 నుండి 12 వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.