రాష్ట్రంలో చీకట్లు అలుముకునే ప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. జనగామ జిల్లా ఖిలాషపూర్‌లో ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలపై మరో రూ.4 వేల క్లో భారం మోపేందుకు కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో చీకట్లు అలుముకునే ప్రమాదం ఉందన్నారు. అందుకే ఎక్స్చేంజీలో విద్యుత్ విక్రయాలు ఆపేశామని పేర్కొన్నారు. డిస్కమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టడం లేదని ఆరోపించారు. డిస్కమ్‌లు కట్టాల్సిన బకాయిలు రూ.20వేల కోట్లకు పైగా ఉండగా, కేవలం రూ.1380 కోట్లు మాత్రమే కట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిదని పేర్కొన్నారు. కేవలం రూ.50 కోట్లే కట్టాల్సి ఉందంటూ ఓ అధికారి పెనాల్టీ గురించి మాత్రమే చెబుతున్నారన్నారు. రాష్ట్ర మంత్రేమో అసలు డబ్బులే కట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారని అన్నారు. దీని పేరు చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.













