తెలంగాణ రాజకీయాల్లో.. సంచలన మార్పులు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్నొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమంలో హుజూరాబాద్ నియోజకవర్గం కీలకపాత్ర పోషించిందని అన్నారు. హుజూరాబాద్ నుంచి అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయన్నారు. ఉదయ్యంలో టీఆర్‍ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితే ఇలా ఉంటే మిగితా టీఆర్‍ఎస్ ఎమ్మెలేయలు, నాయకుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ నీచంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రంలో బలపడుతోందన్నారు. టీఆర్‍ఎస్‍కు రాష్ట్రంలో నూకలు చెల్లే సమయం ఆసన్నమైందన్నారు. సీఎం దగ్గర ఉన్నవాళ్ళు అంత ఉద్యమకారులా? లేదంటే ఉద్యమ ద్రోహులో కేసీఆర్ చెప్పాలన్నారు.