ఉపఎన్నిక షెడ్యూల్ తో ప్రజాసంగ్రామ యాత్ర… వాయిదా
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా పడింది. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో సంజయ్ పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 15 నుంచి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టాలని సంజయ్ నిర్ణయించుకున్నారు. కానీ, ఉప ఎన్నిక నేపథ్యంలో మార్చుకుంటున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. యాత్ర మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించారు. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే.













