అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత పార్టీ కార్యాలయానికి అనేక సార్లు వచ్చినప్పటికీ లాక్డౌన్ కారణంగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ ముఖ్యనేతలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్, మోత్కుపల్లి నరసింహులు తదితరుల సమక్షంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్‌ను నియమించిన విషయం తెలిసిందే.













