Bandi Sanjay: ఇది రాహుల్కు కనిపించడం లేదు: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ ఫుట్బాల్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కనిపించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. హైదరాబాద్లో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ (Messi football match)కు రాహుల్ హాజరుకావడం పై సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రజల ఇబ్బందుల కంటే మెస్సీయే రాహుల్కు ప్రాధాన్యమయ్యారని విమర్శించారు. మీరు ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి వచ్చారు, కానీ మీ ప్రభుత్వం రాష్ట్రంలో పేదల ఇళ్లు కూల్చివేస్తోంది. కలుషిత ఆహారంతో విద్యార్థులు (Students) చనిపోతున్నారు. దారుణ హత్యలు జరుగుతున్నాయి. దేవాలయాలను కూల్చివేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే నిమిషంలో ఇక్కడ ఉంటానని ఎన్నికల ముందు చెప్పారు. కానీ, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గైర్హాజరవుతారు. అల్లర్లు జరిగినప్పుడు విహారయాత్రలో ఉంటారు అని విమర్శించారు.






