ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బండా ప్రకాశ్
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ ప్రశాక్ పదవీ ప్రమాణం చేశారు. ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఛాంబర్లో జరిగిన కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బండా ప్రకాష్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బండా ప్రకాశ్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు సత్యవతి రాథోడ్, మంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, ప్రభాకర్ రావు, బొడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు తదిరులు హాజరయ్యారు.













