ఆర్థిక సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలి : వినోద్‌కుమార్
ఆర్థిక సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో కొలంబియా వర్సీటీలో జరిగిన సమ్మిట్ ఆన్ ఇండియన్ ఎకనమిక్స్ లో ఆయన పాల్గొన్నారు. పలు ఆర్థికాంశాలు అంతర్జాతీయంగా పెను సవాళ్లుగా మారాయన్నారు. వాటికి అనుగుణంగానే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు.. ఎవరైనా మనుగడ సాధించాలంటే పోటీతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ మాజీ చైర్మన్ అరవింద్ పనగారియా, కాగ్ రాజీవ్ మహరి తదితరులు పాల్గొన్నారు. వినోద్ కుమార్ తన సమీప బంధువు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు అమెరికాకు వెళ్లగా.. ఆయనను కొలంబియా వర్సిటీ ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు ఆహ్వానించారు.













