సికింద్రాబాద్ బరిలో అజారుద్దీన్?
వచ్చే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ తెలిపారు. ఇప్పటికే ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ల నుంచి లోక్సభకు పోటీచేసిన తాను 2019 ఎన్నికల్లో సొంత రాష్ట్రం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలిసింది. తన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని, తుది నిర్ణయం పార్టీ తీసుకోవాలన్నారు. తొలుత అజారుద్దీన్ 2009లో యూపీ లోని మొరాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందారు. 2014లో రాజస్థాన్లోని తాంక్-సవాయి మధోపూర్ నుంచి ఓడిపోయారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు సికింద్రాబాద్ నుంచి బరిలో నిలువాలనుకొంటున్నట్లు తెలిపారు.













