అదే విషయాన్ని నేను చెప్పి ఉంటే .. రాద్ధాంతం : ఎంపీ అసదుద్దీన్

బీఆర్‌ఎస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కోసం బీఆర్‌ఎస్ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్రణాళిక వద్దని నేను చెప్పలేదా? అప్పటి విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా? నేను నోరు విప్పితే బీఆర్‌ఎస్ వాళ్లు ఇబ్బంది పడతారు. ఇళ్లు కదల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తాం. బీఆర్‌ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలి. ఆ పార్టీకి జీహెచ్‌ఎంసీలో ఎక్కువ సీట్లు మా చలవే. ఎంఐఎం మద్దతుతోనే ఎక్కువ సీట్లు వచ్చాయి. 24 మంది మార్చి ఉంటే బీఆర్‌ఎస్ మళ్లీ గెలిచేది. అప్పట్లో ఆ పార్టీ నేతలకు అహంకారం ఉండేది. ఎక్కువ మంది సంతానం ఉండాలని చంద్రబాబు, స్టాలిన్ అంటున్నారు. అదే విషయాన్ని నేను చెప్పి ఉంటే రాద్ధాంతం చేసేవారు. దక్షిణ భారత్‌లో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి నష్టం. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గుతుంది. బాగా పనిచేసిన రాష్ట్రాలను ప్రోత్సహించకుండా శిక్షిస్తే ఏం లాభం అని ప్రశ్నించారు.