ఈ పద్ధతులు దేశానికి మంచిది కాదు
రేవంత్రెడ్డి నివాసాలపై ఐటీ దాడుల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచితూచి స్పందించారు. దేశమంతా ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ల్లోనూ ఇలాగే చేశారు. దొంగలు, నేరగాళ్లను పట్టుకోలేరు గానీ, రాజకీయ వేధింపులకు మాత్రం ముందుంటున్నారు. ఎన్నికలు రాగానే మొదలుపెడుతున్నారు. ఈ పద్ధతులు దేశానికి మంచిది కాదు అని చంద్రబాబు సృష్టం చేశారు. ఎన్నికల ముందు అవినీతిపరుల తాట తీస్తామని చెప్పి, ఇప్పుడు అదే అవినీతి పరులను కాపాడే ప్రయత్నం చేయడంవల్ల ప్రధాని మోదీ విశ్వసనీయత కోల్పోయారని విమర్శించారు.













