బ్లాక్ ఫంగస్ కు మరో ఔషధం

బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బీకి ప్రత్యామ్న్యాయ ఔషధాన్ని హైదరాబాద్‍కు చెందిన సెలోన్ లాబరోటరీస్ తయారు చేసింది. యాంఫోటెరిసిన్ బీ ఎమల్షన్‍ను మార్కెట్‍లోకి ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ముడిపదార్థాల కొరత వేధిస్తున్నప్పటికీ వ్యాధి గ్రస్థుల కోసం మూడు వారాల్లో ప్రత్యామ్న్యాయ ఔషధ ఫార్ములాను రూపొందించినట్లు సెలోన్ ఎండీ ఎం.నాగేష్ కుమార్ చెప్పారు. బ్లాక్ ఫంగస్ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని కాపాడటమే తమ లక్ష్యమని ప్రకటించారు. రోజుకు పది వేల వయల్స్ ఉత్పత్తి చేసి ఆస్పత్రులు, కొవిడ్ చికిత్సా కేంద్రాలకు సరఫరా చేస్తామన్నారు. దాంతో నెలకు 6 వేల మంది బ్లాక్ ఫంగస్ రోగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.