తెలంగాణ ప్రభుత్వ విప్ ఐలయ్య ..సంచలన నిర్ణయం…9 రూపాయలే తీసుకుంటా
తెలంగాణ ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అందరినీ ఆలోచింపజేసే విధంగా స్వీయ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ విప్‌గా, ఎమ్మెల్యేగా తన పదవీకాలంలో 5ఏళ్ల పాటు చెల్లించే నెలసరి వేతనంలో కేవలం రూ.9లు మాత్రమే జీతంగా తీసుకొని మిగతా మొత్తాన్ని ప్రజా ప్రయోజన రంగాల్లో ఉపయోగిస్తానని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల వేదికపై ప్రకటించారు. 12 రంగాలకు చెందినవారిని ఆలేరు నియోజక వర్గంలో గుర్తించి వారి సంక్షేమం కోసం వెచ్చిస్తానని తెలిపారు. ప్రతి నెలా వచ్చిన జీతాన్ని పేద ప్రజల కోసం ఖర్చు పెడతానని చెప్పారు. మొదటి వేతనంగా నియోజకవర్గంలో నుంచి 10 వ తరగగతి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందజేశారు. సంవత్సరానికి 12 నెలల్లో 12 రంగాల్లోని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతానన్నారు. మరో నెలలో వృద్ధులకు, వికలాంగులకు, ఆటో కార్మికులకు, గ్రామ పంచాయతీ కార్మికులకు, అనాధ పిల్లలకు, క్షతగాత్రులకు, మెడికల్, నిరుపేద విద్యార్థుల విద్యకు ఖర్చు పెడతానని తెలిపారు.













