తెలంగాణలో ఆప్ పాదయాత్ర
తెలంగాణ రాష్ట్రంపై ఆప్ ఫోకస్ చేసింది. ఈ మధ్య కాలంలో చేసిన సర్వేల్లో తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబదద్లో పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనే అవకాశం ఉన్నట్లుగా తేలిందని ఆ పార్టీ నేతలు చెబతున్నారు. ఇప్పటికే తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు కార్యాచరణ సిద్దం చేసారు. హైదరాబాద్లో కేజ్రీవాల్ పర్యటన పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి సోమనాథ్ భారతి ఇప్పటికే వారంలో రెండు రోజులు రాష్ట్రంలో విసృత్తంగా పర్యటిస్తున్నారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతలతో తరచు సమావేశమవుతూ పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నారు.
ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ నెల 14న హైదరాబాద్కు రానున్నారు. అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని నగరంలో పాదయాత్రకు ఆప్ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఛార్మినార్ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రకు కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. కేజ్రీవాల్ తెలంగాణలో పార్టీ విస్తరణలో భాగంగా వేస్తున్న తొలి అడుగులోనే పార్టీలో చేరికలు ఉండేలా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితే పార్టీ బలపడేందుకు అనువుగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు.













