సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులో 70 పరిశ్రమల మూత
సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులో గత నాలుగు రోజులుగా సుమారు 70 యూనిట్లకు పైగా మూత పడ్డాయి. పాత విద్యుత్ బకాయిల వసూలు పేరుతో సిరిసిల్ల విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) అధికారులు కరెంటు తొలగించడంతో ఇప్పటికే సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పవర్లూం పరిశ్రమలు మరింత నష్టాల పాలు కావడంతో చిన్న తరహా పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. బకాయిల బిల్లులు చెల్లిస్తామని, అప్పటి వరకు కరెంటు తొలగించరాదని సెస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లను వేడుకోగా, దానిపై వీరు సానుకూలత చూపినప్పటికీ దీనికి వ్యతిరేకంగా సెస్ ఏడి కరెంటును తొలగించడంతో దాదాపు 70 పరిశ్రమల మేరకు మూత పడినట్టు తెలిపారు.













