తెలంగాణలో కరోనా విజృంభణ… 24 గంటల్లో

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,551 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43 మంది మృతి చెందినట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం 4,01,783 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 2,042గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 65,597 యాక్టివ్ కేసులు ఉండగా, 3,34,144 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‍లో 1,418, మేడ్చల్ 554, రంగారెడ్డిలో 482, నిజామాబాద్ 389, వరంగల్ అర్బన్‍లో 329, మహబూబ్‍నగర్ 226, ఖమ్మంలో 118, జగిత్యాలలో 276, కరీంనగర్‍లో 222, సిద్దిపేటలో 268, సంగారెడ్డిలో 368 కరోనా కేసులు నమోదు అయ్యాయి.