తెలంగాణలో కరోనా ఉధృతి…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో లెక్కకుమించి కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 2,909 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య 3,24,091కి చేరింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారితో 1,752 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం 17,791 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం 11,495 మంది బాధితులు హోం ఐసోలేషన్‍లో ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ 487, మేడ్చల్ 289, రంగారెడ్డిలో 225 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.