రాయ్ బరేలీ బరిలో ప్రియాంక?
సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగనున్నారా? రాయ్‌బరేలీ నుంచి తనయ ప్రియాంక వాద్రాను బరిలో నిలపనున్నారా? అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగినా కాంగ్రెస్ పార్టీ సోనియా కనుసన్నల్లోనే నడుస్తోందని, ఆమె క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సోనియా అమేఠీని రాహుల్‌కు అప్పగించి రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రాహుల్ వచ్చే ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తే ప్రియాంక అమేఠీ నుంచి బరిలో నిలవొచ్చని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సీడబ్ల్యూసీ విజయవంతమవడం వెనక ప్రియాంక కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.













