భారత్ లో కరోనా విముక్తి!
కరోనా మహమ్మారి విముక్తి సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ (ఎస్యూటీడీ) పరిశోధకులు సమాధానం ఇస్తున్నారు. డిసెంబర్ 8 నాటికి కరోనా రక్కసి నుంచి ప్రపంచానికి విముక్తి లభిస్తుందని వారు చెప్పున్నారు. రోజువారీ కేసుల నమోదు, మరణాలు, కోలుకుంటున్నవారి సంఖ్య, వైరస్ వ్యాప్తి రేటు, లాక్డౌన్ ఆంక్షలు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా దేశాల్లో ఎప్పుడూ వైరస్ అంతమవుతుందన్న దానిపై వారు అంచనాలు రూపొందించారు. కొత్త కేసుల నమోదు 97 శాతం తగ్గినట్లయితే ఆ దేశం గ్రీన్జోన్కి వస్తుంది. భారత్ మే 21 నాటికి గ్రీన్జోన్కి ప్రవేశించనుంది. మే 31 నాటికి కొత్త కేసుల నమోదు 99 శాతం తగ్గిపోనున్నాయి. మొత్తం జూలై 25వ తేదీ నాటికి కరోనా నుంచి భారత్కు విముక్తి లభిస్తుందని పరిశోధకులు అంచనా వేశారు.













