2018లో రామ మందిరం నిర్మాణం
2018లో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుందని బీజేపీ సీనియర్ నాయకులు, విరాట హిందు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డా.సుబ్రమణియన్ స్వామి అన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని న్యాయబద్ధంగా ఎలా నిర్మించాలనే అంశంపై హైదరాబాద్లో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో నాలుగు నెలల్లో కోర్టులో కేసు గెలుస్తామని, దిపావళికల్లా అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి మార్గ సుగమం అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. రామ మందిరాన్ని నిర్మించడానికి కేంద్రంలో మార్గ సుగమం అవుతోందని, దాని దిశగా అడుగులు పడుతున్నాయని, మందిరాన్ని ఆపేశక్తి ఏ ఒక్కరికీ లేదని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో కోర్టులో ఉన్న కేసు అనుకూలంగా వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.













