కరుణానిధిని పరామర్శించిన రాష్ట్రపతి
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని కావేరి దవాఖానలో చికిత్సపొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరామర్శించారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కుమార్తె కనిమొళితో కరుణానిధి ఆరోగ్యంపై వాకబు చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు రాష్ట్ర గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ కూడా ఉన్నారు. రాష్ట్రపతి నేరుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్నారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆకాంక్షించింది.













