పీవీ సింధు మరిన్ని విజయాలు అందుకోవాలి : ప్రధాని
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన తెలుగు తేజం పీవీసింధుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఆమె నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్ గోపీచంద్‌లను మోదీ అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన ఛాంపియన్ సింధు. ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని మోదీ ట్వీట్ చేశారు. భారత స్టార్ క్రీడాకారిణి సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి క్రీడాకారిణిగా భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది.













