ఎల్ఐసి తో జతకట్టిన పేటీఎం
అవధులులేని ఆన్ లైన్ ప్రీమియం చెల్లింపుల కొరకు భారతదేశపు అతిపెద్ద ఇన్స్యూరెన్స్ సంస్థ ఎల్ఐసి తో జతకట్టిన పేటీఎం. ఈ భాగస్వామ్యం తో భారతదేశపు అతిపెద్ద ఆన్ లైన్ బీమా ప్రీమియం చెల్లింపుల వేదికగా మారనున్న పేటీఎం
* ఈ సంవత్సరం చివరకెల్లా 30-40 మిలియన్ పాలసీల రన్ రేట్ ను సాధించుటకు లక్ష్యం కలిగి ఉంది
* 30 కంటే ఎక్కువ బీమా కంపెనీలకు ఆన్ లైన్ ప్రీమియం చెల్లింపులకు వీలు కల్పిస్తుంది
తన బీమా ప్రీమియం చెల్లింపు సేవల పోర్ట్ ఫోలియోను విస్తరిస్తూ, భారతదేశపు అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల కంపెనీ అయిన పేటీఎం బ్రాండ్ ను స్వంతంగా కలిగిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ – భారతీయ జీవితబీమా సంస్థ (ఎల్ఐసి) తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ కలయికతో, వినియోగదారులు ఇప్పుడు ఎల్ఐసి బీమా ప్రీమియం చెల్లింపులను ఈ వేదికపై ఒక్క నిమిషం కంటే తక్కువ సమయంలో అపరిమితంగా చేయవచ్చు.
ఈ వేదికలో సులభమైన ఆన్ లైన్ బీమా ప్రీమియం చెల్లింపు పరిష్కారాలను 30 కి పైగా బీమా కంపెనీల కొరకు అందిస్తుంది, వీటిలో ఎల్ఐసి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్, రిలయన్స్ లైఫ్, మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా ఎఐఎ, ఎస్బిఐ లైఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, కెనెరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్స్యూరెన్స్, శ్రీ రామ్ లైఫ్ మరియుస్టార్ హెల్త్ అనేవి ఉన్నాయి. యూజర్స్ ఆన్ లైన్ బీమా ప్రీమియం చెల్లింపులు చేయడానికి పేటీఎం ఒక అనువైన వేదికగా మారుతోంది మరియు ఈ సంవత్సరం చివరకెల్లా 30-40 మిలియన్ పాలసీల రన్ రేట్ ను సాధించాలనే లక్ష్యం కలిగి ఉంది.
కిరణ్ వాసిరెడ్డి – సిఓఓ, పేటీఎం, ఇలా అన్నారు, “మన దేశంలో బీమా ప్రీమియంలు ఎక్కువగా ఆఫ్ లైన్ లోనే చెల్లించబడుచున్నాయి. పేటీఎంలో, మేము మా వినియోగదారులకు అవధులులేని చెల్లింపుల అనుభవాన్ని కలిగించాలనుకుంటున్నాము. ఎల్ఐసి తో మరియు ఇతర ప్రముఖ బీమా సౌకర్యం అందించు సంస్థలతో మా భాగస్వామ్యం, మిలియన్ల కొద్దీ యూజర్లకు, తమ బీమా పాలసీని ఆన్ లైన్ లో పునరుద్ధరించుకోవడానికి పేటీఎం ఆప్ లో తమకు అనువైన చెల్లింపు పద్ధతిని ఉపయోగించి అవధులులేని చెల్లింపులు చేయడానికి ఒక సరళమైన మరియు వేగవంతమైన పద్ధతిని పరిచయం చేస్తోంది. ఆన్ లైన్ చెల్లింపులను ఉపయోగించడం యొక్క ప్రయోజనాలపై మేము వినియోగదారులకు అవగాహన కల్పించడం కొనసాగిస్తాము, మరియు మా వేదిక ద్వారా అందించబడు ప్రయోజనాల సరళిని వారికి పరిచయం చేస్తాము.”
భారతదేశపు జీవిత బీమా విభాగం, సుమారుగా 360 మిలియన్ పాలసీలు కలిగిఉండి, ప్రపంచంలోనే అతిపెద్దదిగా తన ఉనికిని చాటుతోంది. ఇది రాబోవు ఐదు సంవత్సరాలలో 12-15 శాతం కాంపౌండ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ (సిఎజిఆర్) పెరుగుదలను ఆశిస్తోంది. రాబోవు దశాబ్దంలో బీమా విభాగం కూడా, తన ప్రస్తుత పరిమాణం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల నుండి అందుకు నాలుగింతలు పెరుగుతుందని ఆశించబడింది. పేటీఎం కూడా తన త్వరిత మరియు సౌలభ్యమైన బీమా ప్రీమియం చెల్లింపు సేవతో ఈ మార్కెట్ లోని చొచ్చుకుపోవడం లక్ష్యంగా కలిగి ఉంది.













