ఒబామా వాక్చాతుర్యం
ఒబామా వాక్చాతుర్యం గురించి పరోక్షంగా ఆయన వేసిన చురకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన మాటలు లక్షిత వ్యక్తికి సూటిగా తగిలేలా మాట్లాడటంలో ఆయన దిట్ట. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో ట్వీట్ల ప్రస్తావన వచ్చింది. దాన్ని అందిపుచ్చుకున్న ఓబామా సోషల్ మీడియా గురించీ మాట్లాడారు. ‘నాకు పది కోట్ల మంది ట్విట్టర్ అభిమానులు ఉన్నారు. ఈ సంఖ్య ట్వీట్‌ను భారీగా ఉపయోగిస్తున్న వ్యక్తికంటే చాలా చాలా ఎక్కువ’ అని పేర్కొన్నారు. అంటే, అన్యాపదేశంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును ప్రస్తావించారు. ప్రస్తుతం ట్రంప్‌కు 44 మిలియన్ మంది ట్వీట్ ఫాలోవర్లు మాత్రమే ఉన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. పారిస్ ఒప్పందం విషయంలోనూ ట్రంప్ అనుసరించిన విధానాన్ని పరోక్షంగా దుయ్యబట్టారు.













