వారాణసీలో ప్రధానిపై ఎన్నారైల పోటీ
నల్లగొండ (తెలంగాణ), ప్రకాశం (ఏపీ) జిల్లాల్లోని ఫ్లోరోసిస్ బాధితుల తరపున ప్రధాని మోదీపై పోటీకి వారాణసిలో నామినేషన్లు వేస్తామని రెండు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు తెలిపారు. బాధితుల సలహాలు సూచనల స్వీకరించేందుకు ఎన్నారై ప్రతినిధులు నల్లగొండలోని మరిగ్రూడ, వట్టిపల్లి, శివన్నగూడెంలో పర్యటించారు. కోదాడకు చెందిన ఎన్నారై జలగం సుధీర్, ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారై వడ్డే శ్రీనివాస్, మరో ఇద్దరు ఫ్లోరోసిస్ బాధితులతో కలిసి వారాణసీ వెళ్లనున్నట్లు వారు తెలిపారు. చౌటుప్పల్లో ఫ్లోరైడ్ మిటిగేషన్ సెంటర్ నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, అందుకే ప్రధానిపై పోటీకి దిగుతున్నామని చెప్పారు.













