లోక్ సభ బరిలో ప్రవాసీయులు
ఒకప్పుడు విదేశాల్లో ఉండి వృత్తి, వ్యాపారాల్లో రాణించిన వారు.. మాతృదేశంలో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి ప్రజా సేవకు సై అంటున్నారు. ఇప్పటికే ఓ సారి విజయం సాధించిన వారు కొందరైతే.. గతంలో ఓడిపోయి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారు మరికొందరు. ప్రవాసీయులుగా విదేశాల్లో ప్రతిభ చాటిన వారు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో మధుయాష్కీగౌడ్, కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో గల్లా జయదేవ్, చెల్లంచెట్టి సునీల్ లోక్‌సభ బరిలో ఉన్నారు. విదేశాల్లో సుదీర్ఘ కాలం పాటు ఉన్న వీరందరూ ప్రస్తుతం ప్రజా క్షేత్రంలో తమ ప్రత్యర్థులతో తలపడుతున్నారు.













