ఏపీలో రహదారుల నిర్మాణానికి లక్ష కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ 80 శాతం రవాణా జాతీయ రహదారులపైనే జరుగుతోందన్నారు. ప్రస్తుతం రోజూ 28 కి.మీ. జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని, జల రవాణా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఏపీలో జల రవాణా ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేస్తామని, సాగునీరు ఇస్తే వ్యవసాయం రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. 2019లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు నా వంతు సహకారం అందిస్తామని అన్నారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు.













