ఇకపై ఏడాదికి రెండు సార్లు నీట్, జేఈఈ పరీక్షలు
విద్యార్థుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏడాదికి రెండుసార్లు నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహిస్తామని మానవ వనరుల శాఖ ప్రకటించింది. జనవరి, ఏప్రిల్లో జేఈఈ, ఫిబ్రవరి, మే నెలల్లో నీట్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు హెచ్ఆర్డీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. కొత్త విధానం ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తుందని అన్నారు. నీట్, జేఈఈ పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఏ ఒక్క పరీక్షకు సంబంధించి కూడా సిలబస్లో మార్పు చేయబోమని సృష్టం చేశారు. కేవలం పరీక్షా విధానంలో మాత్రమే మార్పు చేస్తున్నామని అన్నారు.













