తిరుమలలో టీటీడీ చైైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి శనివారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈవో అనిల్‌కుమార్ సింఘల్ వైవీ సుబ్బారెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి కుటుంబసభ్యులతో కలసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. కార్యక్రమానికి మంత్రులు నారాయణస్వామి, ఆదిమూలపు సురేష్, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, పాలక మండలి మాజీ సభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సినీ నిర్మాత దిల్‌రాజు తదితరులు హాజరయ్యారు.













