తీర్మానం చేయకపోతే రాజీనామా : ముస్తఫా
సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే ముస్తపా పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమానికి వ్యతిరేకంగా సీఎం జగన్ వ్యవహరించబోరన్న నమ్మకం తనకుందని అన్నారు. వైసీపీ సింహగర్జన సదస్సులో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఈ కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామన్నారు. ప్రభుత్వం తీర్మానం చేయకుంటే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని ప్రకటించారు.













