గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థులు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన గడప-గడపకు కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం`విజయనగరం-విశాఖపట్నం జిల్లాల నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతారాజు సుధాకర్, ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల నియోజకవర్గ అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, కర్నూలు-కడప-అనంతపురం జిల్లాల నియోజకవర్గానికి వెన్నపూస రవిని పోటీలో నిలపనున్నట్లు తెలిపారు.













