పలాస బహిరంగ సభలో వైయస్ జగన్మోహన్రెడ్డి
– దేశమంతా జీఎస్టీ (వస్తు సేవల పన్ను) ఉంటే, పలాసలో తెలుగుదేశం పార్టీ పన్ను (టీఎస్టీ) వసూలు చేస్తున్నారు.
– ప్రతి జీడిపప్పు ప్యాకెట్‌పై స్థానిక ఎమ్మెల్యే అల్లుడు రూ.10 వసూలు చేస్తున్నాడు.
– వ్యాపారులను వేధిస్తున్నారు. వినకపోతే అధికారులతో దాడి చేయిస్తున్నారు.
– తిత్లి తుపాను పరిహారం ఇంకా అందలేదు. ఇచ్చిన చెక్కులు చెల్లలేదు.
– వైయస్సార్సీపీ అధికారం చేపడితే, తిత్లి తుపానులో నష్టపోయిన ప్రతి కొబ్బరిచెట్టుకు రూ.3 వేలు, హెక్టార్ జీడి తోటకు రూ.50 వేల చొప్పున పరిహారం.
– వేల మంది కిడ్నీ రోగుల్లో కేవలం 370 మందికే పింఛన్లు ఇస్తున్నారు. అది కూడా ముష్టి వేసినట్లు రూ.2500 మాత్రమే ఇస్తున్నారు.
– ఆస్పత్రుల్లో కేవలం 1400 మందికి మాత్రమే డయలాసిస్ సేవలందుతున్నాయి.
– అధికారం చేపట్టిన మూడు నెలల్లో 200 బెడ్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పరిశోధనా కేంద్రం పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తాం.
– కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛను ఇస్తాము.
– 5 ఏళ్ల చంద్రబాబు పాలన చూశాం. గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు అమలయ్యాయా? అన్నది ఆలోచించండి.
– రాష్ట్ర విభజన నాటికి ఏపీలో 1.42 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని గుర్తించారు. వాటిని భర్తీ చేయలేదు.
– ఉద్యోగుల పదవీ విరమణలతో ఖాళీల సంఖ్య 2.40 లక్షలకు చేరింది.
– ఏపీలో ఏటా 5 లక్షల మంది ఎస్సెస్సీ, 4 లక్షల మంది ఇంటర్మీడియట్, 1.80 లక్షల మంది డిగ్రీ, లక్ష మందికి పైగా పీజీ పూర్తి చేస్తున్నారు. వారంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.
– కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు.
– ఏపీలో 1.70 కోట్ల ఇళ్లుండగా, వాటికి నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారు.
– ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, రాష్ట్ర పరిధిలో ఖాళీగా ఉన్న దాదాపు 2.40 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఏటా జనవరి 1న నోటిఫికేషన్లు, అందు కోసం క్యాలెండర్లు ప్రకటిస్తాం.
– దీంతో పాటు, ఉద్యోగాల కల్పన కోసం విప్లవాత్మక మార్పు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా, అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే చట్టం.
– ఇంకా ప్రభుత్వం నడిపే సర్వీసులు, అద్దెకు తీసుకునే వాహనాల్లో నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇస్తాము. వారికి పెట్టుబడుల్లో సబ్సిడీ.
– వాటన్నింటిలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయింపు.
– ప్రతి గ్రామంలో 10 మందితో గ్రామ సచివాలయాలు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్. వారికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం.
– ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతర ప్రయత్నం.
– జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సాహం. ఇంకా యువతలో నెపుణ్యం పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు.
– చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి చంద్రబాబుకు లేదు. అందుకే కుట్రలు చేస్తున్నాడు.
– చివరకు హత్యా రాజకీయాలకు సైతం వెనుకాడడం లేదు.













