పాడేరు బహిరంగ సభలో వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
– సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో అందరి కష్టాలు చూశాను. సమస్యలు విన్నాను. ముఖ్యంగా ఎస్టీ నియోజకవర్గాలలో గిరిజనుల కష్టాలను చాలా దగ్గరగా చూశాను.
– నాన్న గారి హయాం తర్వాత.. ప్రజలకు మంచి చేయాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో ఉండాలని ఆరాటపడే వారు కరువయ్యారు.
– నాన్న పోయాక నాపైనా ఆప్యాయత చూపారు. ఎంతో ఆదరించారు.
– రేపు మన ప్రభుత్వం ఏర్పడితే అందరి కంటే ఎక్కువగా పేదలే బాగు పడతారు.
– ఎస్సీలు, ఎస్టీలు దారుణ పేదరికంలో ఉన్నారు. నాన్నగారి హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలు ఎస్టీలకు పంపిణీ చేశారు.
– ఈ ప్రభుత్వం కనీసం గిరిజన సలహా మండలి (టీఏసీ) ఏర్పాటు చేయలేదు.
– గెల్చిన ఏడుగురు గిరిజనుల్లో ఆరుగురు వైయస్సార్సీపీకి చెందిన వారే కావడంతో ప్రభుత్వం కక్షపూరితంగా టీఏసీ ఏర్పాటు చేయలేదు.
– మన ప్రభుత్వం ఏర్పడితే మీకు న్యాయం చేస్తాను.
– ప్రతి ఐటీడీఏ పరిధిలో 3 నెలల్లో సూపర్ స్పెషాలటీ ఆస్పత్రుల పనులు ప్రారంభిస్తాం.
– గిరిజన ప్రాంతాలను కలిసి జిల్లాగా ఏర్పాటు చేసి, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు, యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తాము.
– ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సైట్ మైనింగ్ జరగదని హామీ ఇస్తున్నాను.
– ఈ 5 ఏళ్లలో అవినీతి, మోసం, దగా, అన్యాయమైన పాలన చూశాం.
– కానీ చంద్రబాబు మాత్రం ధర్మరాజుకు ధర్మం నేర్పినట్లు, హరిశ్చంద్రుడికి సత్యాలు పలకడం నేర్పినట్లు మాట్లాడుతాడు.
– మన కర్మకొద్దీ 5 ఏళ్లు మన జీవితాలు ఆయన చేతిలో పెడితే, మన బతుకులు మారాయా?
– రాష్ట్రానికి 650 అవార్డులు వచ్చాయట. రాష్ట్రాన్ని ఆయన నెంబర్ వన్ చేశాడట.
– నిజమే కొన్నింటిలో నెంబర్ వన్ చేశాడు. ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా..
– గ్రామాల్లో ఇవాళ జన్మభూమి కమిటీలు మాఫియాలా మారాయి.
– మరి ఇలాంటి పాలన కావాలా? ఒక సామెత గుర్తుకు వస్తుంది.
– ‘తల్లికి అన్నం పెట్టని వాడు. పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తానన్నాడట’. అలా ఉంది చంద్రబాబు వ్యవహారం.
– 2014 నుంచి ఏమీ చేయని చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ ఓట్లు అడుగుతూ, ‘మీ భవిష్యత్తు–నా భరోసా’ అంటూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.













