పాత పథకాలకే నవరత్నాల ముసుగు
నవరత్నాలు కాదు.. నవ కోతలు- నవ రద్దులు అని టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బడ్జెట్లో రద్దు చేసిన పథకాలు ఎన్నో చెప్పాలన్నారు. పేర్లు మార్చి పేదల మనసుల్లోంచి టీడీపీని తొలగించలేరని సృష్టం చేశారు. తొలి బడ్జెట్లోనే వైసీపీ నేతలు వెల్లకిలా పడ్డారని విమర్శించారు. చేతగాక చేతులు కత్తిరిస్తామంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పాత పథకాలకే నవరత్నాల ముసుగు వేస్తున్నారని మండిపడ్డారు. కరవు నివారణ చర్యల గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు. రీటెండరింగ్ పేరుతో పోలవరం, రాజధాని పనులకు గండికొట్టారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి రూ.500 కోట్లు పెట్టడమే వైసీపీ నేతల చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే కొత్త పరిశ్రమలు రావడం అటుంచితే ఉన్నవి పోయే ప్రమాదముందని విమర్శించారు.













