ఆయనకు దశ ఉంది.. కానీ దిశ లేదు
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్లో ప్రచారం ఎక్కువ.. పస తక్కువని విమర్శించారు. సీఎం జగన్‌కు దశ ఉంది కానీ దిశ లేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో నేనున్నాను..నేను విన్నాను అని చెప్పే జగన్. నేను తిన్నాను అని కూడా చెప్పుకుంటే బాగుంటుంది. అప్పుల గురించి గత ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేశారని సుమారు రూ.48 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధమయ్యారు. వడ్డీలేని రుణాలపై హడావుడి చేసి రూ.100 కోట్లు పెట్టారు. జలవనరుల్లో రూ.వెయ్యి కోట్లు తగ్గించారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు అంతంతమాత్రమే. సాంఘిక సంక్షేమానికి నిధులు బాగా తగ్గించారు. ఏం ఉద్ధరించారని పథకాలకు వైఎస్ పేరు పెడుతున్నారు. ప్రజా పథకాలకు ఫ్యాక్షన్ కుటుంబం పేర్లు పెడతారా? కొన్ని పథకాలను రద్దు చేసి ప్రజలను రోడ్డున పడేస్తున్నారు అని యనమల ఆరోపించారు.













