ఏపీకి వరల్డ్ సమ్మిట్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ప్రజాపంపిణీ వ్వవస్థలో నగదు రహిత లావాదేవీలను విజయవంతంగా అమలుచేసినందుకు ప్రపంచ సమ్మిట్ అవార్డు దక్కింది. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచస్థాయి డబ్ల్యూఎస్‌ఏ సదస్సులో ఈ అవార్డును రియల్‌టైమ్ గవర్నెన్స్ సీఈవో బాబు ఎ అందుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన 1100 పరిష్కార వేదికకు కూడా సదస్సులో పలువురు ప్రతినిధుల ప్రశంసలు అందాయని బాబు చెప్పారు. శాఖలపనితీరుకు ఎప్పటికప్పుడు రేటింగ్స్ ఇస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 70 శాతం మంది పేదలు నగదు రహిత విధానంలో నెలవారీ రేషన్ పొందుతున్నారని, ఇది మిగిళిన రాష్ట్రాలకు ఆదదర్శంగా నిలుస్తోందని వివరించారు.













