త్వరలో మహిళలకు ఉచిత ప్రయాణం : రాంప్రసాద్ రెడ్డి
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. రవాణాశాఖ మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి కడప విచ్చేసిన రాంప్రసాద్ రెడ్డికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే ఉచిత ప్రయాణం అమలవుతున్నందున, మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రవేశపెడతామన్నారు. గడిచిన ఐదేళ్లలో జగన్ ముఠా దోపిడీ చేసిన ప్రజాధనాన్ని వడ్డీతో సహా కక్కిస్తామన్నారు.













