NBK111: బాలయ్య తో నటించే ఆ ఇద్దరు ఎవరు?
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) ఇప్పుడు కెరీర్లో పీక్స్ చూస్తున్నారు. వరుస సక్సెస్ లు బాలయ్య(Balayya)ను ఊపిరాడనీయనంత సంతోషంలో ముంచుతున్నాయి. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బాలయ్య కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను(Boyapati srinu) దర్శకత్వంలో అఖండ2(Akhanda2) చేస్తున్న బాలయ్య ఆ సినిమాను సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
అఖండ2(Akhanda2) తర్వాత బాలయ్య తనకు వీర సింహారెడ్డి(Veera simhareddy) లాంటి హిట్ ను అందించిన గోపీచంద్ మలినేని(Gopichand malineni)తో మరోసారి జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. బాలయ్య కెరీర్లో 111(NBK111)వ సినిమాగా తెరకెక్కనున్న ఆ మూవీ గురించి రీసెంట్ గా నాట్స్ లో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, బాలయ్యను ఈసారి చాలా డిఫరెంట్ యాంగిల్ లో చూపించనున్నట్టు చెప్పారు.
గోపీచంద్ మలినేని మాటలతో అందరికీ భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఎన్బీకే111లో కీలక పాత్రల్లో నటించడానికి ఇద్దరు ప్రముఖ నటులతో గోపీచంద్ మలినేని చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే ఆ నటులెవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈసారి గోపీచంద్ మలినేని, బాలయ్య కోసం చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.













