పోలీసులు జగన్ కు తలనొప్పిగా మారతారేమో…?
రాజకీయంగా అధికార పార్టీలు కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. రాజకీయంగా ఎంత బలంగా ఉన్న పార్టీ అయినా సరే కొన్ని కొన్ని అంశాలను చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు కొన్ని తప్పులను ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మంచి పేరున్న కొంతమంది నేతలు కాస్త ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి.
రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో కొన్ని కొన్ని వర్గాలను వాడుకునే విషయంలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా పోలీసులు విషయంలో వైసీపీ నేతలు అనుసరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా మారుతుంది. వైసీపీ నేతలు కొంతమంది పోలీసులను అనుకూలంగా మార్చుకుని తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడానికి కొన్ని కొన్ని కార్యక్రమాలకు దిగుతున్నారు. దీనితో ముఖ్యమంత్రి జగన్ కు చెడ్డపేరు వస్తుందనే ఆవేదన వ్యక్తం అవుతోంది.
పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే కు సహకరించిన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక వ్యక్తిగత వ్యవహారాల్లో కూడా పోలీసులు తలదూర్చే పరిస్థితి ఉంటుంది. గతంలో పోలీసులు ఎప్పుడూ కూడా ఇన్ని విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితులు లేవు. ముఖ్యంగా గతంలో ఎప్పుడూ కూడా ఇన్ని ఆరోపణలు డీజీపీని కూడా టార్గెట్ చేస్తూ వినపడిన పరిస్థితి లేదనే చెప్పాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలు పోలీసులను టార్గెట్ చేసిన పరిస్థితి లేదు అనే సంగతి తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పోలీసులు పదేపదే టార్గెట్ అవుతూ వస్తున్నారు.
దీని వలన పోలీసు వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం పోవడమే కాకుండా ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ దూకుడుగా ముందుకు వెళుతోంది. ఈ తరుణంలో పోలీసుల అత్యుత్సాహం ఎక్కువగా ఉంటుంది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. అలాగే తమ మాట వినని వారిని పోలీసుల ద్వారా వైసీపీ నేతలు బెదిరించడం అక్రమ కేసులు బనాయించడం వంటివి కూడా జరుగుతున్నాయి. కొంతమంది పోలీసులు పెడుతున్న కేసులు చూస్తే అసలు వీరికి సెక్షన్ లు అసలు తెలుసా అనే విధంగా విమర్శలు ఉన్నాయి.
ఎస్ సి ల అట్రాసిటీ కేసులు పెట్టడంపై తీవ్రస్థాయి విమర్శలకు దారి తీస్తుంది అని చెప్పాలి. ఇలాంటి వ్యవహారాలు ద్వారా పోలీసులు… పోలీసు శాఖ పరువు తీస్తున్నారు అని ఆవేదన మాజీ అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విమర్శలకు కూడా పోలీస్ అసోసియేషన్ దిగటం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ విధానాల మారకపోతే పోలీస్ శాఖ పరువు పోతుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.













