వైసీపీ బంద్ కు మద్దతు ఇవ్వం
రాహుల్ గాంధీ ద్వారానే ప్రత్యేక హోదా అమలు సాధ్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. వైసీపీ పిలుపునిచ్చిన రేపటి బంద్ కు తాము మద్దతు ఇవ్వడం లేదని ఆయన సృష్టం చేశారు. బంద్ ల పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. బీజేపీ వ్యూహంలో వైసీపీ బందీగా మారిందని అన్నారు. బంద్ ల పేరుతో వైసీపీ నాటకాలాడుతోందని విమర్శించారు. బీజేపీకి నాలుగేళ్ల పాటు మద్దతిచ్చిన టీడీపీ, పరోక్షంగా మద్దతు తెలిపిన వైసీపీలు ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పించలేకపోయాయని అన్నారు. ప్రత్యేక హోదా అంశంలో కాంగ్రెస్ పార్టీ సృష్టమైన విధానంతో ఉందన్నారు.













