వీవీఐటీ విద్యార్థికి గూగుల్ కాలిఫోర్నియా కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం
వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీఎస్ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న పుల్లగుర్ల హర్షతేజకు గూగుల్ సంస్థ, అమెరికా, కాలిఫోర్నియాలో గూగుల్ ఐఓ కాన్ఫరెన్స్-2018 లో పాల్గొనడానికి ఆహ్వానం అందిందని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. నేటి నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ కాన్ఫరెన్స్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక ప్రసంగం చేయనున్నారు. గూగుల్ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు యూనివర్సిటీ ఇన్ఫోవేషన్ ఫెలోస్ పేరుతో డిజైన్ థింకింగ్ ఛాలెంజ్‌ను నిర్వహించింది. ప్రాథమిక దశలో మనదేశం నుంచి 220 మంది విద్యార్థులను ఎంపిక చేయగా, తుది దశలో కాన్ఫరెన్స్‌కు ఎంపికైన ముగ్గురిలో ఒకరు వీవీఐటీ విద్యార్థి కావడం విశేషం.













