విఐటీ-ఏపీ, మిచిగాన్ యూనివర్సిటీల ఒప్పందం
విఐటి-ఏపీ విద్యాసంస్థ అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్తో విద్యాసంబంధమైన ఒప్పందం కుదుర్చుకుంది. విఐటి ఏపీ ఛాన్స్లర్ డాక్టర్ జి.విశ్వనాథ్, మిచిగాన్ యూనివర్సిటీ ఛాన్స్లర్ డాక్టర్ డేనియల్ ఇ.లిటిల్ ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇటీవల జరిగిన చర్చల మేరకు ఈ రెండు విద్యా సంస్థలు ఒప్పందాన్ని పూర్తి చేసుకున్నాయి. విఎస్బిలో బిబిఏ విద్యార్థులకు మిచిగాన్ యూనివర్సిటీ నుంచి బిబిఏ పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తూ ఆ మొత్తాన్ని మిచిగాన్ యూనివర్సిటీ ఫీజులో తగ్గించే సదుపాయం కల్పిస్తున్నారు. దీంతో ఈ అవకాశం అక్కడ చదువుకునే ఇతర అంతర్జాతీయ విద్యార్థులకు వ్యత్యాసం లేకుండా ఉంటుంది.













