మిషిగాన్-డియర్ బోర్న్ వర్సిటీతో వీఐటీ-ఏపీ ఒప్పందం
బీబీఏ డిగ్రీ కోర్సుకు సంబంధించి వీఐటీ-ఏపీ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ డియర్ బోర్న్ యుఎండీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. అమెరికాలోని మిషిగాన్ -డియర్ బోర్న్ వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఛాన్సలర్ డానియల్ లిటిల్, వీఐటీ ఛాన్సలర్ జి.విశ్వనాథన్ ఈ మేరకు అంగీకార పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందంతో అమరావతిలోని వీఐటీ వర్సిటీలో బీబీఏ చేసే విద్యార్థులు రెండేళ్లు అమరావతిలో, రెండేళ్లు అమెరికాలో చదువుకోవచ్చని విశ్వనాథన్ తెలిపారు. చదువు పూర్తయ్యాక ఆ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందవచ్చన్నారు. మరో ఆప్షన్‌గా అమరావతిలో మూడేళ్ల బీబీఏ డిగ్రీ, ఏడాది డిప్లొమా చేశాక ఎంఎస్ అమెరికాలో చేయవచ్చని ఒక ప్రకటనలో వెల్లడించారు. వీఐటీ అమరావతి ప్రాంగణంలో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు యుఎండీలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసే సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు బీబీఏకు దరఖాస్తు చేసుకోవచ్చుని వీఐటీ-ఏపీ వర్సిటీ ఉపాధ్యాక్షుడు శేఖర్ విశ్వనాథన్ తెలిపారు.













