శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి
తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కుటుంబసమేతంగా వెంకయ్య శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వెంకయ్యకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ ఏడాది తర్వాత తాను తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. ప్రజలంతా బాగుండాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు. ఏడాదికి ఒకసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకునే చర్యలు తీసుకోవాలని, ఇందుకు టీటీడీకి వీవీఐపీలు కూడా సహకరించాలని ఆయన తెలిపారు. ఏడాదికి ఒకసారి నిబంధనలతో చాలామందికి దర్శనం అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.













