4 నుంచి ఉపరాష్ట్రపతి ఏపీ పర్యటన
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 6వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. 4వ తేదీ సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకోనున్న ఆయన, 5న కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం విజయవాడ లయోలా కళాశాల శత వసంతాల వేడుకలకు హాజరవుతారు. 6న ఉదయం స్వర్ణభారతి ట్రస్ట్‌లో వైద్య శిబిరం ప్రారంభించి, సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకుంటారని ఏపీ ప్రభుత్వ ప్రొటోకాల్ అడిషనల్ సెక్రటరీ ఎం.అశోక్ బాబు తెలిపారు.













