ఈ నెల 26న అమరావతికి ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వెంకయ్య నాయుడు తొలిసారి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. ఈ నెల 26న అమరావతికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రానున్నట్లు కలెక్టర్ కోన శశిధర్ వెల్లడించారు. ఆయన రాకను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంకయ్య ఆత్మీయ సన్మానం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర అర్బన్ హౌసింగ్ కార్యక్రమంలో వెంకయ్య పాల్గొంటారన్నారు. అక్కడి నుంచి సాయంత్రం తెనాలిలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.













